డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు ఆది సాయికుమార్. తాజాగా తన నుంచి రాబోతున్న చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖంతో భయం కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇందులో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్‌గా నటిస్తున్నాడు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నాడు.