రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా పూనుకోవాలి

రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా పూనుకోవాలి

భారత రాజ్యాంగం ఎన్నడూ లేని ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్.  ఈ రాజ్యాంగమే లేకపోతే అడ్డంగా దోచుకోవచ్చని కొందరూ చూస్తున్నారన్నారు. అలాంటి వారే రాజ్యాంగం అడ్డు తొలగించుకోవాలని దాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మనుషులంతా సమానమని రాజ్యాంగం చెబుతోందన్నారు. ఈ రాజ్యాంగమే లేకపోతే మనమంతా సమానమనే హక్కు కోల్పోతామన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా పూనుకోవాలన్నారు. రాష్ట్రంలో లక్షా 92 వేల ఖాళీలుంటే అందులో 91 వేల ఊద్యోగాలే ఉన్నాయని సీఎం చూపించారన్నారు. 

లక్ష ఖాళీలను కుదించారన్నారు. వీటిని కూడా భర్తీ చేయాలని మనమంతా డిమాండ్ చేయాలని కోదండారం పేర్కొన్నారు. టైమ్ బౌండ్ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన నిరుద్యోగ యువత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మన హక్కుల పరిరక్షణ కోసం అందరం ఐక్యం కావాలన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నకేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో యుద్ధబేరి మహాసభ నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం కోసం కరీంగనర్ ప్రెస్ భవన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన కోదండరామ్, మంద కృష్ణ మాదిగ, ఇతర నేతలు పాల్గొన్నారు.