జూన్ 3 నుంచి టీజేఎంయూ ఆందోళనలు

జూన్ 3 నుంచి టీజేఎంయూ ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  టీజేఎంయూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది.  వచ్చే నెల 3న అన్ని డిపోల ముందు ఎర్ర రిబ్బన్ లతో నిరసన చేపడతామని  తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజ్ వెల్లడించారు. 13న  వేల మంది కార్మికులతో  బస్ భవన్ ను ముట్టడిస్తున్నామని  తెలిపారు. ఆదివారం విద్యానగర్​లోని ఆఫీసులో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ కార్మికులకు 2 పీఆర్సీలు RTC Workerప్రభుత్వం బాకీ ఉందని,  3 డీఏలను వెంటనే ప్రకటించాలని, 2013 కు సంబంధించిన వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకున్న సీసీఎస్,  పీఎఫ్ డబ్బులను సుమారు 3వేల కోట్లు యాజమాన్యం వాడుకున్నదని, వీటిని తిరిగి చెల్లించాలన్నారు.  రోజుకు 12 గంటల నుంచి 18 గంటల వరకు బలవంతంగా డ్యూటీలు చేయించుకుంటున్నారని, కార్మికులను అధికారులు వేధిస్తున్నారని, బస్సులను, కార్మికులను తగ్గిస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ యూనియన్లను రద్దుచేసి అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు.