అమరుల కుటుంబాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలె

అమరుల కుటుంబాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలె

హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల వీరులను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని  టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదంరాం ఆరోపించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని టీజేఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని బియ్యం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... రాష్ట్ర సాధన ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్ధిక సాయం అందలేదన్నారు. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రాష్ట్ర పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని ఫైర్ అయ్యారు.