అదానీపై ప్రశ్నల రగడ: లోక్సభ నుంచి TMC MP మహువా మెయిత్రాపై సస్పెన్షన్

అదానీపై ప్రశ్నల రగడ: లోక్సభ నుంచి TMC MP మహువా మెయిత్రాపై సస్పెన్షన్

డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు వేశారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. డబ్బులు తీసుకొని అదానీ గ్రూప్ పై ప్రశ్నలు వేశారని ఆరోపిస్తూ మహువా మెయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె లోక్ సభలో ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం( డిసెంబర్ 8) ఈ వ్యవహారంలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదికను ఆమోదించిన లోక్ సభ స్పీకర్.. టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు. 

లోక్సభ నుంచి తనను సస్పెండ్ చేయడంపై టీఎంసీ మహువా మొయిత్రా  పార్లమెంట్ బయట ఆగ్రహం వ్యక్తం చేరశారు. బహిష్కరించే హక్కు ఎథిక్స్ కమిటీకి లేదని అన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం ముగింపుకు ఆరంభం అంటూ ఘాటుగా చేశారు మహువా మొయిత్రా.

టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా పార్లమెంట్ అదానీ గ్రూప్ పై ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపార వేత్త హీరానందానీ నుంచి లంచాలు తీసుకున్నారని 2023 అక్టోబర్ 15న లోక్ స్పీకర్  ఓం బిర్లాకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె లేఖ రాయడంతో దుమారం పెద్ద దూమారం రేగింది. మెయిత్రా పార్లమెంటరీ అధికారాన్ని ఉల్లంఘించారని అరోపించారు దూబే. తక్షణమే ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకీ హీరానందానీ్ రూ. 2 కోట్లు, ఖరీదైన ఐ ఫోన్ వంటి బహుమతులు ఇచ్చారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు రూ. 75 లక్షలు ఇచ్చారని బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేశారు. మెయిత్రా పార్లమెంట్ లో లేవనెత్తిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్ హీరానందానీ, అతని కంపెనీ వ్యాపారాలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు సమాచారాన్ని దూబే పేర్కొన్నారు. 
బీజేపీ ఎంపీ ఆరోపణలపై మెయిత్రా స్పందిస్తూ.. తనపై ఎలాంటి విచారణను అయినా స్వాగతిస్తున్నానంటూ  అప్పట్లో ప్రకటించారు. హీరానందానీ గ్రూప్ కూడా దూబే ఆరోపణను తోసిపుచ్చింది. మేం రాజకీయ వ్యాపారం చేయమని చెప్పారు.. 

శుక్రవారం( డిసెంబర్ 8) ఈ వ్యవహారంలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదికను ఆమోదించిన లోక్సభ స్పీకర్.. టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు.