ఖమ్మంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన

ఖమ్మంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన

ఖమ్మం టౌన్, వెలుగు :  టీఎన్జీఓ కార్యాలయంపై మూకుమ్మడి దాడి, ప్లెక్సీల చించివేత, యూనియన్ అధ్యక్షుడు అఫ్జల్ హసన్ పై దాడికి యత్నించడాన్ని టీఎన్జీఓ ఖండించింది. ఈ మేరకు  మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో విధుల్లో పాల్గొన్న  ఉద్యోగులు  నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

టీఎన్జీఓ కేంద్ర సంఘం పిలుపు మేరకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ అఫ్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్, తాలూకా, యూనిట్, ఫోరంల నాయకులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లోని సంఘం కార్యాలయంలో జనరల్ సెక్రటరీ మారం జగదీశ్ ను కలిశారు. వివాదానికి సంబంధించిన వివరాలు ఆయనకు వివరించినట్లు అఫ్జల్ హసన్ చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందగిరి శ్రీను, రాష్ట్ర కార్యదర్శి జి.ఎస్. ప్రసాద్ రావు పాల్గొన్నారు.