సైబర్ మోసాలతో జాగ్రత్త

సైబర్ మోసాలతో జాగ్రత్త

ప్రస్తుతం సైబర్ మోసాలు అధికమయినట్లు వెల్లడించారు డీజీపీ మహేందర్ రెడ్డి. సైబర్ నెరాల్లో ఆర్థిక నేరాలే కాకుండా డిజిటల్ క్రైమ్స్ జరుగుతున్నాయని...సైబర్ నేరాల్లో బాధితులు కోట్లల్లో ఉంటున్నారని తెలిపారు.  తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో... ఇవాళ(శనివారం) సైబర్ సురక్షిత, జాతీయ భద్రత అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆన్ లైన్ మోసాలపై టోల్ ఫ్రీ నెంబర్ 1930  పోస్టర్ ను లాంచ్ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాలు జాతీయ భద్రతకు ముప్పు వంటిదని అభివర్ణించారు. సైబర్ నేరాల నియాత్రణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సైబర్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ ...ఇంటర్ నెట్ టెక్నాలజీలో ముందు ఉన్నా డిజిటల్ క్రైమ్ పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం T4C తీసుకరావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కాల్ సెంటర్ వెన్నెముకలా పని చేస్తుందన్నారు. కంపెనీలు సెక్యూరిటీ మెజర్స్ పాటించాలని...ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ యూనిట్స్ పెట్టడం జరిగిందని వెల్లడించారు. సేఫ్ సెక్యూరిటీ కోసం నిరంతరం పని చేస్తున్నామన్నారు. బ్యాంక్ లు సురక్షితంగా లేవని పేర్కొన్నారు. బ్యాంక్ లు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించాల్సిందేనని మహేష్ బ్యాంక్ లో సెక్యూరిటీ మెజర్స్ లేకపోవడంతో రూ. 20 కోట్లు పోయాయన్నారు. ఇండియాలో సెల్ ఫోన్ యూజర్స్ 1 బిలియన్స్ ఉన్నట్లు.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని మరోసారి సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. 

సైబర్ మోసాలు ఎన్నో జరుగుతున్నాయని.. సైబర్ సెక్యూర్టీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియాత్రణ కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ను తీసుకొచ్చామని పేర్కొన్న ఆయన సైబర్ నేరస్తులకు శిక్షలు పడే విధంగా లీగల్ సెల్ తో అప్రోచ్ అవుతున్నామన్నారు.