మాతృ దినోత్సవంపై డీజీపీ ట్వీట్

మాతృ దినోత్సవంపై డీజీపీ ట్వీట్

హైదరాబాద్‌ : ఎల్లప్పుడు పనితో బిజీగా ఉండే తల్లులకు కొంత విశ్రాంతిని ఇద్దామని తెలిపారు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకుని ప్రతీ మాతృమూర్తికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ… అమ్మ జీవితంలో ప్రతీ రోజూ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రోజు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన రక్షణ కోసం తను తపన పడినట్లుగా ఇంకెవరూ పడరన్నారు. ఈ ప్రపంచంలో తొలి గురువు అమ్మే అన్నారు. మనను కాపాడే రక్షణ కవచమన్నారు. అందరూ ఇంట్లోనే ఉండండి.. లాక్‌డౌన్‌ పిరియడ్‌ను ఒక అవకాశంగా ఉపయోగించుకుని ఎల్లప్పుడు పనితో బిజీగా ఉండే తల్లులకు కొంత విశ్రాంతిని ఇద్దామని ట్వీట్ చేశారు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.