
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిన్నటి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 2,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..వైరస్ తో 12 మంది చనిపోయారని శుక్రవారం వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,257కి చేరగా..53,239 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ప్రస్తుతం కరోనా బారినపడ్డ 21,412 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా..వైరస్ తో ఇప్పటివరకు మొత్తం 601 మంది చనిపోయారని తెలిపింది. గురువారం 21,417 శాంపిల్స్ పరీక్షించగా..మొత్తంగా టెస్టుల సంఖ్య 5,66,948కి చేరిందని వెల్లడించింది రాష్ట్ర ఆరోగ్య శాఖ.