
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..వైరస్ తో 14 మంది చనిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరిందని..ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. 24 గంటల్లో 1,091 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 22,568 కరోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వెల్లడించింది. వైరస్ తో ఇప్పటివరకు 615 మంది చనిపోయారని చెప్పింది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,322 టెస్టులు చేశామని తెలిపింది వైద్యారోగ్యశాఖ.