
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హెల్త్ బులిటెన్ ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 983 మందికి పాజిటివ్ వచ్చిందని.. ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 48,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం రాష్ట్రంలో 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 551 మంది చనిపోయారని.. ఇంకా 1,414 రిపోర్టులకు సంబంధించిన ఫలితం తేలాల్సి ఉందని తెలిపింది వైద్య ఆరోగ్యశాఖ.