హైదరాబాద్లో తేలికపాటి జల్లులు

హైదరాబాద్లో తేలికపాటి జల్లులు

రాష్ట్రంలో వాతావరణం ఈ రోజు, రేపు మేఘావృతంగానే ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తరువాత ఎండలు కనిపించే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ లో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు తేలికపాటి జల్లులు కురిశాయి. రాజేంద్రనగర్ ఏరియాలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, రాజేంద్రనగర్ లోని సబ్ స్టేషన్ ప్రాంతంలో 1.2 సెంటీమీటర్ల తేలికపాటి వర్షం కురిసింది. చంద్రన్న గుట్ట, ఫలక్ నమా, కార్వాన్, మలక్ పేట్, చార్మినార్ ,ఎల్బీనగర్, సంతోష్ నగర్, సరూర్ నగర్ ఏరియాల్లోనూ  తేలికపాటి వర్షం పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వరుణుడి బీభత్సం తొలగలేదు. భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడింది. కాగా, రాష్ట్రంలో జులై నెలలో సాధారణం కంటే 450 శాతం ఎక్కువగా వర్షపాతo నమోదైందని పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.