హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఆదివారం అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో అడ్మిషన్స్ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. 7, 8, 9, 10 తరగతుల్లోని ఖాళీలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,983 మంది స్టూడెంట్లు ఈ పరీక్షకు హాజరు కానున్నారని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి తెలిపారు. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
