
యూకే: బ్రిటన్ రాజుగా శనివారం కింగ్ చార్లెస్- 3 బాధ్యతలు తీసుకుం టున్నారు. వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో పట్టాభిషేక వేడుక జరగనుంది. రాణిగా కెమిల్లా కూడా క్వీన్ మేరీ కిరీటాన్ని ధరిస్తారు. ఆర్చి బిషప్ ఆఫ్ కాంటెర్‌బరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అతిథుల పరిచయ కార్యక్రమంతో మొదలయ్యే ఈ వేడుక బంగారు తాపడం బగ్గీలో రాజు, రాణి ప్రయాణంతో ముగుస్తుం ది.
2 వేల మంది అతిథులు
ఈ పట్టాభిషేకానికి ప్రపంచ వ్యాప్తంగా 2వేల మంది అతిథులు హాజరవుతున్నారు. ఇండియా తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందింది. అయితే, ప్రెసిడెంట్ బదులు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కర్ హాజరుకానున్నారు.