
ముంబై: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుని.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయిన టీమిండియా ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం పూర్తి స్థాయిలో రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కంగారూలతో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో ఇండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. బావమరిది పెళ్లి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తున్నాడు. మిగతా లైనప్ మొత్తం అందుబాటులో ఉండటంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఇక టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్ వన్డేల్లోనైనా తడాఖా చూపెట్టాలని ప్లాన్స్ వేస్తోంది. ఫ్లాట్‌గా కనిపిస్తున్న వాంఖడే పిచ్‌పై టార్గెట్ ఛేజింగ్ ఈజీగా ఉండనుంది.
వరల్డ్ కప్ టీమ్‌పై ఫోకస్
సొంతగడ్డపై వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ నుంచే మెగా టోర్నీకి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. అందుబాటులో ఉన్న ప్రతి ప్లేయర్‌కు అవకాశం ఇచ్చి బలమైన తుది జట్టును ఎంచుకోవాలని భావిస్తోంది. దీంతో ఆసీస్‌తో జరిగే మూడు వన్డేలపై భారీగా ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ఆడిన ఆరు వన్డే (శ్రీలంక, న్యూజిలాండ్‌తో చెరో మూడు)ల్లో మూడు సెంచరీలతో 567 రన్స్ చేసిన గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ లేకపోవడంతో గిల్‌కు తోడుగా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. గత ఆరు మ్యాచ్‌ల్లో 338 రన్స్ చేసిన కోహ్లీ కూడా భారీ స్కోర్లపై దృష్టి పెట్టాడు. అయితే ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా నుంచి వీళ్లకు గట్టిపోటీ ఎదురుకావొచ్చు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, రజత్ పటీదార్ మధ్య పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్‌ను కేవలం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా ఆడించాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నది. హార్దిక్, జడేజా కూడా గాడిలో పడితే ఇండియాకు తిరుగుండదు. బౌలింగ్‌లో శార్దూల్, సిరాజ్, షమీ ప్లేస్‌లు ఖాయంగా కనిపిస్తున్నా ఉమ్రాన్ మాలిక్ కూడా రేస్‌లో ఉన్నాడు. అయితే స్పిన్నర్లలోనే తీవ్ర పోటీ నెలకొంది. జడేజా, అక్షర్ పటేల్, సుందర్, చహల్, కుల్దీప్‌లో ఎవర్ని తీసుకుంటారో చూడాలి.
జట్ల (అంచనా)
ఇండియా: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్ / రజత్ పటిదార్, కేఎల్ రాహుల్, జడేజా, అక్షర్ పటేల్ / సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ / ఉమ్రాన్ మాలిక్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, లబుషేన్, మిచెల్ మార్ష్ / మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్.
వార్నర్, మ్యాక్సీ వచ్చేశారు..
ఈ సిరీస్ కోసం ఆసీస్ కూడా పూర్తి స్థాయి టీమ్‌ను బరిలోకి దించుతున్నది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ మాత్రమే ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. టెస్ట్‌ల్లో ఫెయిలైన వార్నర్‌తో పాటు, ఆల్‌రౌండర్స్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ తడాఖా చూపేందుకు రెడీగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, లబుషేన్, మిచెల్ మార్ష్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అన్నింటికి మించి స్మిత్ కెప్టెన్‌గా ఉండ టం మరో అనుకూలాంశం. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు అం దుబా టులో ఉండటం కంగా రూలకు అదనపు బలం. అలెక్స్ క్యారీ, గ్రీన్ కూడా చెలరేగితే ఇండియాకు ఇబ్బం దులు తప్పవు. బౌ లింగ్‌లో స్టార్క్, జంపా, ఎల్లిస్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే గత మూడున్నర నెలలుగా ఆసీస్ వన్డేలకు దూరంగా ఉండటం ప్రతికూలాంశం. దీనిని అధిగమిస్తే విజయాన్ని ఆశించొచ్చు.