ఇవాళ ఏపీ సీఎంగా జగన్​ ప్రమాణం

ఇవాళ ఏపీ సీఎంగా జగన్​ ప్రమాణం
  • మధ్యాహ్నం 12.23 గంటలకు
  • ముఖ్య అతిథులుగా కేసీఆర్, నితీశ్, స్టాలిన్
  • నవరత్నాల ప్రకటనకు అవకాశం
  • కార్యక్రమానికి దూరంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు
  • తిరుమల శ్రీవారు, విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న జగన్

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్​స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. తర్వాత నవరత్నాల అమలుపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. తమ సర్కారు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ చర్యలపై మాట్లాడతారని సమాచారం. కార్యక్రమానికి వైసీపీ శ్రేణులతోపాటు సీఎం కేసీఆర్​, అన్నా డీఎంకే చీఫ్ స్టాలిన్​, సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి,  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్​ సీఎస్​లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఐదు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా జారీ చేసిన పాసులు ఉన్నవారినే ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. స్టేడియం లోపల, బయట, విజయవాడలోని 14 ప్రధాన కూడళ్లలో ఎఈడీ స్ర్కీన్​లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తనకు బదులుగా టీడీపీ సీనియర్ నేతలతో కూడిన బృందం తాడేపల్లిలోని ఇంటికి వెళ్లి జగన్ కు​ శుభాకాంక్షలు తెలపనుంది.

ప్రత్యేకంగా జగన్​ ఎంట్రీ

గురువారం ఉదయం జగన్ కుటుంబ సమే తంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. తర్వాత తాడేపల్లి నివాసం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు  ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకోనున్నారు. జగన్​ఎంట్రీ కోసం అధికారులు ఓపెన్​టాప్​ వాహనాన్ని సిద్ధం చేశారు. గ్యాలరీల్లో కూర్చునే సాధారణ ప్రజలకు జగన్ ఓపెన్ టాప్ వాహనంపై నిలబడి అభివాదం చేస్తారు.