యంగ్ ఇండియాకు ఎదురుందా!

యంగ్ ఇండియాకు ఎదురుందా!

ఓస్బర్న్: అండర్ 19 వరల్డ్ కప్  లో యంగ్ ఇండియా నాకౌట్ ఫైట్ కు రెడీ అయింది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో గెలిచి గత ఫైనల్లో ఆ టీమ్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమికి రివెంజ్‌‌‌‌ తీర్చుకోవాలని భావిస్తోంది. ఐర్లాండ్‌‌‌‌తో గ్రూప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు ముందు కరోనా పాజిటివ్‌‌‌‌గా తేలిన ఆరుగురు ప్లేయర్లలో కెప్టెన్‌‌‌‌ యశ్‌‌‌‌ ధుల్‌‌‌‌, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ షేక్‌‌‌‌ రషీద్‌‌‌‌, మరో ముగ్గురు కోలుకున్నప్పటికీ కొత్తగా నిశాంత్‌‌‌‌ సింధు వైరస్‌‌‌‌ బారిన పడ్డాడు. యశ్‌‌‌‌ ధుల్‌‌‌‌ లేకపోవడంతో గత రెండు గ్రూప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో నిశాంత్‌‌‌‌ స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఇండియాకు భారీ విజయాలు అందించాడు. ఇప్పుడు తను లేకపోయినా.. యశ్‌‌‌‌, షేక్‌‌‌‌ రషీద్‌‌‌‌ రాకతో టీమ్‌‌‌‌ బలం పెరిగింది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల జోరును క్వార్టర్స్ లోనూ కంటిన్యూ చేయాలని టీమ్​ ఆశిస్తోంది.
సెమీస్​కు అఫ్గాన్​
సెన్సేషనల్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన అఫ్గానిస్తాన్‌‌‌‌.. శ్రీలంకకు చెక్‌‌‌‌ పెట్టి సెమీఫైనల్‌‌‌‌ చేరుకుంది. గురువారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌‌‌‌లో అఫ్గాన్‌‌‌‌ 4 రన్స్‌‌‌‌ తేడాతో లంకపై థ్రిల్లింగ్‌‌‌‌ విక్టరీ సాధించింది.