
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్గురువారం ఎమ్మె ల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. వీల్ చైర్‌లో అసెంబ్లీ లాబీలోని లీడర్ ఆఫ్ ది అపోజి షన్ (ఎల్వోపీ) కార్యాలయానికి చేరుకు ని పూజలు నిర్వహిస్తారు. ఎల్వోపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం కేసీఆర్ నందినగర్‌లోని తన ఇంటికి వెళ్తారని, అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌కు పోతారని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.