Today OTT Movies: ఇవాళ మే8న ఓటీటీకి వచ్చిన 4 ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Today OTT Movies: ఇవాళ మే8న ఓటీటీకి వచ్చిన 4 ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 4 ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్ దర్శనిమిచ్చాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్, స్పై యాక్షన్, రొమాంటిక్ కామెడీ జోనర్స్లో సినిమాలున్నాయి. వీటిలో భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమాలున్నాయి. అలాగే, ఆడియన్స్ని డిస్సప్పాయింట్ చేసినవి కూడా ఉన్నాయి.  మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్కి వచ్చాయి? అనే వివరాలు చూసేద్దాం. 

జాక్ ఓటీటీ:

జాక్ మూవీ 2025 ఏప్రిల్ 10న థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. నేడు మే 8నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ థియేటర్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో సిద్ధుకి హ్యాట్రిక్ హిట్ మిస్ అవ్వడంతోపాటు భారీ ఫెయిల్యూర్ను సొంతం చేసుకున్నాడు. మరి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటోందో చూడాలి.  

జాక్ బడ్జెట్:

ఈ మూవీ రూ.18 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. (ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ: 16 కోట్ల గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2 కోట్ల గ్రాస్) దాంతో రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి.. కేవలం రూ.10 కోట్ల లోపే వ‌సూళ్లు రాబట్టి నిర్మాత‌ల‌కు భారీగా నష్టాలను మిగిల్చింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ:

తమిళ స్టార్ హీరో అజిత్ నటించి సూపర్ హిట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly).ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి అజిత్ కెరియర్లోనే సూపర్ హిట్ ఖాతాలో చేరింది.

అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు మే 8 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మేకర్స్ నిర్మించారు. 

‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ ఓటీటీ:

టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్.  జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో క్రియేట‌ర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వచించారు. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2025 ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రిలీజైంది.

ఈ కామెడీ డ్రామా థియేటర్లో ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కానీ ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. నేడు గురువారం (మే 8) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. 

ఓదెల 2:

తమన్నా లీడ్ రోల్‌‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’(Odela 2). దర్శకుడు సంపత్ నంది సూపర్‌‌‌‌ విజన్‌‌లో అశోక్ తేజ రూపొందించాడు. డి మధు నిర్మించారు. 2025 ఏప్రిల్ 17న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైంది. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్నే చవిచూస్తోంది. మేకర్స్ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయారు.

ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ప్రైమ్ వీడియో దాదాపు రూ.18 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇపుడీ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ సంపత్ నంది అధికారికంగా X లో పోస్ట్ చేసి వెల్లడించారు.