
టోక్యో: కరోనా దెబ్బకు ఏడాది ఆలస్యంగా మొదలైన టోక్యో ఒలింపిక్ గేమ్స్ ఆదివారం ముగియనున్నాయి. జులై 23న అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకల్లో వెలిగిన కలడ్రాన్ నేటితో ఆగనుంది. కరోనా ముప్పుకు తోడు .. జపాన్ ప్రజలు నిరసనలను దాటుకుంటూ జరిగిన టోక్యో గేమ్స్ ఇప్పటిదాకా సాఫీగా జరిగాయి. చివరి రోజు వేడుకలు కూడా సురక్షితంగా పూర్తయితే.. ఓ మహాసంగ్రామం సంతోషంగా ముగిసినట్టు అవుతుంది. మెడల్ టేబుల్లో చైనా, అమెరికా మధ్య గట్టి పోటీ నడుస్తోంది. టాపర్ చైనా ఖాతాలో 38 గోల్డ్ మెడల్స్ ఉండగా.. అమెరికా 36 స్వర్ణాలతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. చివరి రోజు 8 గేమ్స్ ఉండగా.. టాప్ ప్లేస్ ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. కాగా, ఇండియా ఒక గోల్డ్ సహా 7 మెడల్స్‌తో ప్రస్తుతం 47వ ప్లేస్‌లో ఉంది.