హైదరాబాద్ లో మోస్తరు వర్షం

హైదరాబాద్ లో  మోస్తరు వర్షం

హైదరాబాద్ లో వర్షం పడుతోంది. వరుసగా మూడ్రోజులుగా సాయంత్రం కాగానే వర్షం కురుస్తోంది. సిటీ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం దంచికొడుతోంది. కోఠి, దిల్ సుఖ్ నగర్, కొత్త పేట్, ఎల్బీనగర్, అత్తాపూర్, మీర్ పేట్, బడంగ్ పేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పుప్పాలగూడ, మణికొండ, గండిపేట, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, శంషాబాద్, హిమాయత్ సాగర్ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లోనూ మోస్తరు వర్షం పడుతోంది.