వృద్ధులకు నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం

వృద్ధులకు నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం

రేపు చంటిపిల్లల తల్లిదండ్రులకు

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా వయోవృద్ధులు (65 సంవత్సరాలు  పైబడినవారు), దివ్యాంగులకు  మంగళవారం 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.  ఐదేళ్లలోపు చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు  సుపథం ద్వారా ఉచిత దర్శనానికి అనుమతిస్తారు.

today special Darshan for senior citizens in tirumala