మనిషి జంతువైన మరో కథ వైరల్..

మనిషి జంతువైన మరో కథ వైరల్..

పరకాయ ప్రవేశం అనే మాటను మనం పాత సినిమాల్లో వినేవాళ్లం ..చూసేవాళ్లం. పరుల శరీరంలో ప్రవేశించే విద్యనే  పరకాయ ప్రవేశం అని పేరు.  అజపాన మహా మంత్రం సంకల్ప చేతనే పరకాయ ప్రవేశం చేయడానికి వీలుంటుందని పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు పరకాయ ప్రవేశం మాదిరిగానే జంతువుగా మారాలనుకుంటున్న వ్యక్తుల ఆసక్తి(Human Transforming)కి సంబంధించిన స్టోరీలు వెలుగులోకి వచ్చాయి. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. సేమ్ టు సేం కుక్కలా మారడానికి భారీగా నే ఖర్చుపెట్టాడు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన కొద్దిరోజులకే తాజా మరో వ్యక్తి దాదాపు రూ. 17 లక్షలు ఖర్చు చేసి  తోడేలుగా మారడం గురించి నెటిజన్లలో చర్చనీయాంశమైంది. 

టాకో అనే జపనీస్ వ్యక్తి తనను తాను హైపర్ రియలిస్టిక్ కోలీగా మార్చుకున్నాడని విన్న కొన్ని రోజులకే అలాంటి మరొక సంఘటన బయటకు వచ్చింది. జపాన్‌కు చెందిన మరో వ్యక్తి 'తోడేలుగా మారడానికి' దాదాపు ₹17 లక్షలు వెచ్చించి వోల్ఫ్ గా మారడం చర్చనీయాంశమైంది. Toru Ueda  అనే టోక్యోకు చెందిన ఒక ఇంజనీర్ బొచ్చుతో కూడిన కస్టమ్-మేడ్ వోల్ఫ్ సూట్‌ను  ధరించి సేమ్ టు సేమ్ తోడేలుగా కనిపించడం అందరిని దృష్టిని ఆకర్షించింది. టోరు మొదట్లో మీడియా కంట పడకూడదనుకున్నాడు.. అయితే ఇటీవల తన ఆసక్తికరమైన కోరికను వ్యక్తం చేస్తూ ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను జంతువులా ఉండాలనే కోరికను ఇలా సరదాగా తీర్చుకున్నానని.. వోల్ఫ్ సూట్ ను ధరించినప్పుడు తోడేలు లాగా ప్రవర్తిస్తానని 32 యేళ్ల టోరు  మీడియాకు చెప్పుకొచ్చాడు.