చెరువుల్లో మ‌‌‌‌ట్టి పోస్తే చెప్పండి

చెరువుల్లో మ‌‌‌‌ట్టి పోస్తే చెప్పండి
  •     90001 13667కు సమాచారమివ్వండి : హైడ్రా

 హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులను కబ్జా చేసేందుకు మ‌‌‌‌ట్టి తెచ్చి పోస్తున్న వారి స‌‌‌‌మాచారం తెలియ‌‌‌‌జేయాల‌‌‌‌ని హైడ్రా అధికారులు కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబ‌‌‌‌ర్ 90001 13667 కేటాయించారు. వాట్సాప్​ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చన్నారు. చెరువులో మ‌‌‌‌ట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీబీల‌‌‌‌ వీడియోలను షేర్​చేయవచ్చన్నారు.

 కాల‌‌‌‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల‌‌‌‌తోపాటు కాలేజీ స్టూడెంట్లు, స్వచ్చంద సంస్థలు హైడ్రాకు మద్దతు ఇవ్వాలని కోరారు. 30 రోజుల్లో హైడ్రా అధికారులు 31 లారీలను సీజ్​చేసి కేసులు నమోదు చేశారు. ఇందులో లారీ ఓన‌‌‌‌ర్లతోపాటు నిర్మాణ సంస్థల‌‌‌‌కు చెందినవారు ఉన్నారు. జేసీబీ, ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లతోపాటు మ‌‌‌‌ట్టి త‌‌‌‌ర‌‌‌‌లించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల‌‌‌‌పై నిఘా పెట్టి చ‌‌‌‌ర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.