ఫిట్స్ తో డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర్ రావు కన్నుమూత

 ఫిట్స్ తో  డైరెక్టర్  కేఎస్ నాగేశ్వర్ రావు కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర్ రావు కన్నుమూశారు. నిన్న హైదరాబాద్ కు వస్తుండగా  కోదాడ దగ్గర్లో  ఫిట్స్ వచ్చి అకస్మాత్ గా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు హుటా హుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న(శుక్రవారం) సాయంత్రం మృతి చెందారు.. ఆయన స్వస్థలం అయిన కోయిలగుడేం దగ్గరలో ఉన్న పోతవరంలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. నాగేశ్వర్ రావు మృతి పట్ల సినీ ప్రముఖులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు.. ఆ తర్వాత శ్రీశైలం,  విజయశాంతితో  వైజయంతి చిత్రాలను రూపొందించి మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కెఎస్ నాగేశ్వరరావు రీసెంట్ గా బిచ్చగడా మజాకా చిత్రాన్ని తెరకెక్కించారు.