పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్లి పీటలెక్కారు. పూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన వీరి వివాహానికి హీరో నితిన్ దంపతులు, కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుములతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన నితీన్.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వెంకీ అట్లూరికి కంగ్రాట్స్ చెప్పారు. పూజతో నీ జీవితం మరింత అందంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెంకీ అట్లూరి జ్ఞాపకం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాలకు డైలాగ్ రైటర్ గా  పనిచేశారు. వరుణ్ తేజ్,రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ మూవీతో డైరెక్టర్ గా మారారు. తర్వాత మిస్టర్ మజ్ను, నితిన్ తో రంగ్ దే తీశారు. ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ తో సార్ అనే మూవీని చేస్తున్నారు.