మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముదనుకు రాబోతోంది.
అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హీరో నవీన్ చంద్ర కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయం గురించి నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ గేమ్ ఛేంజర్ సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా మొదటగా గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేస్తున్న భరత్ తనని సంప్రదించారని ఈ క్రమంలో శంకర్ సినిమా అని చెప్పడంతో తన పాత్ర గురించి వివరాలు తెలుసుకోకుండానే ఒప్పకున్నానని తెలిపాడు. ఇక గేమ్ ఛేంజర్ లో తనది ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అలాగే ఎక్కువ సన్నివేశాలు రామ్ చరణ్ తో ఉంటాయని చెపుకొచ్చాడు. ఇక డైరెక్టర్ శంకర్ సినిమా సెట్ లో ప్రతీదీ తానే దగ్గరుండి చూసుకుంటాడాని అలాగే యాక్ట్ చేసేముందు తానే యాక్ట్ చేసి చూపిస్తాడాని దీంతో నటీనటులకి మరింత ఈజీ అవ్వడంతోపాటూ మేకింగ్ లో క్వాలిటీ పెరుగుతుందని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా నటుడు నవీన్ చంద్ర హీరోగా, విలన్ గా నటించి వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సీరీస్లలో కూడా నటించి మెప్పించాడు.