న్యూఢిల్లీ: ప్రస్తుతం కిలో టమాటా రూ.150 వరకు పలుకుతుండగా, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ మ్యాజిక్‌పిన్ రూ.70లకే అమ్ముతోంది. అయితే ఇది నేరుగా కాకుండా ఓఎన్డీసీ ప్లాట్‌ఫారాల ద్వారా విక్రయిస్తోంది. చిన్న వ్యాపార సంస్థలు తమ ప్రొడక్టులను ఆన్లైన్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికే ఓఎన్డీసీ. కస్టమర్లు మ్యాజిక్‌పిన్ యాప్, పేటీఎం, ఫోన్‌పే ద్వారా ఆర్డర్ఇవ్వొచ్చు. ప్రస్తుతం మైసూరు, ఢిల్లీ–ఎన్సీఆర్తోపాటు మరికొన్ని నగరాల్లో ఈ ఆఫర్ఉంది. ఈ విషయమై మ్యాజిక్‌పిన్ సీఈఓ అన్షూ శర్మ మాట్లాడుతూ ఆఫర్ మొదలైన రెండు రోజుల్లోనే ఢిల్లీ నుంచి వెయ్యి ఆర్డర్లు వచ్చాయని అన్నారు.
