పీఎన్జీ, సీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

పీఎన్జీ, సీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
  • హనుమకొండ  కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ, వెలుగు: పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని  హనుమకొండ  కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గురువారం మేఘా పైప్ లైన్ నేచురల్ గ్యాస్  ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న గ్యాస్ సరఫరాకు సంబంధించి జిల్లా స్థాయి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) విస్తరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సివిల్ సప్లయిస్, పోలీస్, ఇండస్ట్రీస్, ఆర్ అండ్ బీ, విద్యుత్, పంచాయతీ, ఇతర శాఖలతో పాటు మేఘా గ్యాస్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.  

వివిధ శాఖలకు సంబంధించి అనుమతుల కోసం నోడల్ అధికారిగా పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్ వ్యవరిస్తారన్నారు. ఈ గ్యాస్ వినియోగానికి దరఖాస్తు చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత పోర్టల్ పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం పీఎన్జీ, సీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, మేఘా గ్యాస్ సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ అవినాశ్, డీసీఎస్వో వాజిద్ అలీ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు పాల్గొన్నారు.