రంగంలోకి దిగిన మోదీ ..దిగిరానున్న టమాటా ధరలు..

రంగంలోకి దిగిన మోదీ ..దిగిరానున్న  టమాటా ధరలు..

వినియోగదారులకు గుడ్ న్యూస్.  టమాటా ధరలు భారీగా తగ్గనున్నాయి. ఊహించని విధంగా టమాటా ధరలు దిగిరానున్నాయి.  దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో..ఈ ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం  రంగంలోకి దిగింది. టమాటా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో టమాటాలు సేకరించి..వినియోగదారులకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. 

 ఏ ఏ రాష్ట్రాల నుంచి సేకరిస్తారంటే..

దేశంలో అన్ని రాష్ట్రాల్లో టమాటా ఉత్పత్తి అవుతుంది. అయితే మిగిలిన రాష్ట్రాల కంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో అక్కడి రైతులు టమాటాను ఎక్కువగా సాగుచేస్తారు. దేశ అవసరాల్లో  58 శాతం టమాటా ఈ రాష్ట్రాల నుంచే   ఉత్పత్తి అవుతుంది.  ఈ క్రమంలోనే ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో టమాటాను సేకరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇందులో భాగంగా టమాటాలను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ను ఆదేశించారు. 

ఏ ఏ రాష్ట్రాలకు పంపిణీ చేస్తారంటే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కాయి. ముఖ్యంగా ఢిల్లీలో టమాటా ధర డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. అలాగే ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లోనూ టమాటా ధర 180గా పలుకుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల నుంచి భారీగా టమాటాను సేకరించి ఈ రాష్ట్రాల్లో పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో టమాటా ధరలు మండిపోతున్నందున అక్కడ వినియోగదారులకు తక్కువ ధరకు టమాటాను అందించనుంది. 

ALSOREAD :Layoffs : 160 మంది ఉద్యోగులను తీసేసి.. ఒక్క రోబోను పెట్టుకున్నారు


మూడు రాష్ట్రాల నుంచి..మూడు ప్రాంతాలకు టమాటా సరఫరా..

ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్లకు భారీ మొత్తంలో టమాటా సరఫరా అవుతోంది. మహారాష్ట్రలోని సతారా, నారాయణంగావ్, నాసిక్ జిల్లాల నుంచి ఈ నెలాఖరు వరకు టమాటాను తరలిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహర శాఖ స్పష్టం చేసింద.ి అలాగే ఢిల్లీ, ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కర్ణాటక నుంచి టమాటాలను తరలించనుంది.