Layoffs : 160 మంది ఉద్యోగులను తీసేసి.. ఒక్క రోబోను పెట్టుకున్నారు

Layoffs : 160 మంది ఉద్యోగులను తీసేసి.. ఒక్క రోబోను పెట్టుకున్నారు

కస్టమర్ సపోర్ట్ క్వెరీల కోసం అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ( AI) చాట్‌బాట్‌ను అమలు చేయడంతో కంపెనీ తన 90% సహాయక సిబ్బందిని తొలగించినట్లు దుకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో సుమిత్ షా ఇటీవల ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు. జూలై 11న షేర్ చేసిన ఈ ట్వీట్ లో దుకాన్.. స్వంత AI అసిస్టెంట్ ఇంట్రడ్యూసింగ్ రిజల్యూషన్ సమయాన్ని 2 గంటల 13 నిమిషాల నుంచి కేవలం 3 నిమిషాల 12 సెకన్లకు గణనీయంగా తగ్గించిందని షా వివరించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు.

ALSOREAD :చివరికి బేకరిలో కూడా కల్తీ ఆగట్లేదు... బేకరీ ప్రియులారా.. హై అలర్ట్​

“ఈ AI చాట్‌బాట్ కారణంగా మేము మా సపోర్టివ్ గ్రూప్ లో 90 శాతం మందిని తొలగించాల్సి వచ్చింది. ఇది అవసరమా? ఖచ్చితంగా" అని షా ట్వీట్ చేశారు. ప్రోగ్రామింగ్ అనుభవం లేని వ్యాపారులు తమ సొంత ఇ-కామర్స్ స్టోర్‌లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే DIY ప్లాట్‌ఫారమ్, కస్టమర్ సపోర్ట్ సవాళ్లతో చాలా కాలంగా ఇబ్బంది పడుతోందని, దీన్ని పరిష్కరించడానికి AI విప్లవాన్ని తాను ఒక అవకాశంగా భావించానని ఆయన అంగీకరించారు. "దుకాన్ స్వంత AI అసిస్టెంట్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇది కస్టమర్ ప్రశ్నలకు ఎక్కడైనా, ఎప్పుడైనా తక్షణమే, ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది" అని షా వివరించారు.

లీనా పేరుతో ఉన్న చాట్‌బాట్ ఇప్పటికే 14వందల సపోర్ట్ టిక్కెట్‌లను పరిష్కరించిందని, అయితే ఇది దుకాన్ AI ట్రాన్స్ ఫార్మేషన్ కు నాంది మాత్రమేనని కూడా అతను పేర్కొన్నాడు. తమ సిబ్బందిని తీసివేయడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

We had to layoff 90% of our support team because of this AI chatbot.

Tough? Yes. Necessary? Absolutely.

The results?

Time to first response went from 1m 44s to INSTANT!
Resolution time went from 2h 13m to 3m 12s
Customer support costs reduced by ~85%

Here's how's we did it ?

— Suumit Shah (@suumitshah) July 10, 2023