నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన జవాన్లు

నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన జవాన్లు

శ్రీనగర్: సౌత్ కశ్మీర్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. షోపియాన్ తో పాటు పుల్వామాలో సెక్యూరిటీ ఫోర్సెస్ కు టెర్రరిస్టులకు మధ్య రెండు ఎన్ కౌంటర్ లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా.. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో అన్సార్ ఘాజ్వట్ ఉల్ హింద్ (ఏజీయూహెచ్) చీఫ్, టెర్రరిస్ట్ ఇంతియాజ్ షా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపులు కొనసాగిస్తున్నాయి.