బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట.. మోదీ, అమిత్​ షా, యోగీ రోడ్​ షోలు

బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట.. మోదీ, అమిత్​ షా, యోగీ రోడ్​ షోలు

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేశారు.  ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ లో మకాం వేశారు. తూప్రాన్, నిర్మల్ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం తిరుమలకు వెళ్లారు మోడీ.  తిరుమల శ్రీవారిని రేపు నవంబర్​ 27న దర్శించుకొని మళ్లీ తెలంగాణ ఎన్నికల సభల్లో పాల్గోనున్నారు.  రేపు కరీంనగర్​, హైదరాబాద్​ రోడ్​ షోలో ప్రధాని మోదీ పాల్గోనున్నారు.   ఇక ఈ రోజు ( నవంబర్​ 26)   కేంద్రహో మంత్రి అమిత్​ షా, మక్తల్, ములుగు, భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. తరువాత కూకట్ పల్లి లో రోడ్ షో నిర్వహించారు.  అటు నాలుగు నియోజకవర్గాల్లో యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. 

తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ రోడ్డు షోలలో పాల్గొన్నారు.  . తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే... నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారని, కుటుంబ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.