Top Rated Indian Web Series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే..అత్యధిక IMDb రేటింగ్ పొందిన సిరీస్‌ ఇదే

Top Rated Indian Web Series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే..అత్యధిక IMDb రేటింగ్ పొందిన సిరీస్‌ ఇదే

ఇండియాలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. 4 ఏళ్ళ ముందు వరకు కేవలం సినిమాలతోనే ఎంటర్టైన్ అయ్యే ఆడియన్స్ ఓటీటీలు వచ్చాకా వెబ్ సిరీస్ ల కోసం ఎగబడుతున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. స్టార్స్ అండ్ మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కొత్త కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు. దీంతో.. ప్రేక్షకులు కూడా సినిమాల కన్నా వెబ్ సిరీస్ లే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చిందని సిచువేషన్.

అలా మన ఇండియాలో ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్‌డీబీ టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ ఇవే..అవేంటో  ఒక లుక్కేద్దాం. 

స్కామ్ 1992 - సోనీలివ్

హర్షద్ మెహతా స్కామ్..ఫైనాన్షియల్ మార్కెట్‌‌పై కాస్తో కూస్తో టచ్ ఉన్న వారందరికీ ఈ స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. సోనీలివ్ ఓటీటీలో 2020లో వచ్చిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఇప్పటికే ఇండియాలో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ కలిగిన సిరీస్ గా నిలిచింది.  స్కామ్ తోనే ‘సోనీ లివ్ ’ హిట్ కొట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఐఎండీబీలో అత్యధికంగా 9.3 రేటింగ్ ఉండటం విశేషం.

ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లలోకి అడుగులేస్తోన్న యంగ్ మిలీనియల్స్‌‌కు(యువతకు) ఈ వెబ్‌‌ సిరీస్‌‌పై ఆసక్తి కలిగింది. హర్షద్ మెహతా స్కామ్‌‌పై వెబ్‌‌ సిరీస్‌‌ రిలీజ్ అయ్యాక.. మస్తు మంది సోనీలివ్ ‌‌ను సబ్‌‌స్క్రయిబ్ చేసుకుని మరీ దీన్ని వీక్షించారు.

ఫైనాన్షియల్ మార్కెట్‌‌లో రిస్క్ తీసుకున్న హర్షద్ మెహతా మాత్రమే కాక.. సోనీ పిక్చర్స్ నెట్‌‌వర్క్స్(ఎస్‌‌పీఎన్‌‌)కు చెందిన ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ సోనీ లైవ్  కూడా ఈ సిరీస్‌‌తో పెద్ద రిస్క్‌‌నే తీసుకుందని చెప్పొచ్చు. ఆ రిస్క్‌‌లో హర్షద్ మెహతా ఓడిపోతే.. ఈ రిస్క్‌‌లో సోనీలివ్  గెలిచింది. 

ఆస్పిరెంట్స్ - ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ఈ ఆస్పిరెంట్స్. దీన్ని కథ విషయానికి వస్తే..చిన్నప్పుడు నుంచే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఐఏఎస్ కావాలని కలలు కనే ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే ఈ సీరిస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ  వెబ్ సిరీస్ కు చూసిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆస్పిరెంట్ కి చైతన్యం కలిగిస్తోంది. ఈ సీరీస్ కు ఐఎండీబీలో 9.2 రేటింగ్ వచ్చింది. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అందించిన అద్భుతమైన వెబ్ సిరీస్ ఇది.

గుల్లక్ - సోనీలివ్

మధ్యతరగతి కుటుంబాల జీవితాలపై తెరకెక్కిన ఈ చిత్రం ప్రతో ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటె, ఇండియా అంటేనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తో ఉన్న దేశం. అలాంటి దేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓ పిగ్గీ బ్యాంక్ అనేది తప్పకుండ ఉంటుంది. దాని చుట్టూ తిరిగే కథే ఈ గుల్లక్ సినిమా. ఈ సీరిస్ ఇంట్రస్టింగ్ గా మనసారా నవ్వుకునేలా తెరకెక్కించారు మేకర్స్. 

పంచాయత్ -ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం సిద్ధమవుతున్న వెబ్ సిరీస్ పంచాయత్. ఇంజినీరింగ్ చదివి పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఆశపడిన ఓ యువకుడు చివరికి యూపీలోని ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీగా చేరుతాడు.

ఆ ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో అక్కడ అతడు పడే ఇబ్బందులు, ఆ తర్వాత ఊళ్లో వాళ్లతో అతనికి ఏర్పడిన బంధాలు చాలా చక్కగా చూపించారు ఇందులో. ఈ సిరీస్ కు 8.9 రేటింగ్ ఇచ్చింది ఐమ్‌డీబీ.   

ది ఫ్యామిలీ మ్యాన్ - ప్రైమ్ వీడియో

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు ఓటీటీలో విశేష ఆదరణ దక్కుతోంది. తొలి సిరీస్‌కు మించి రెండో సీజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా మూడో సీజన్ కోసం ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్నారు. 

మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. సెకండ్ సీజన్ లో స్టార్ హీరోయిన్ సమంత నటించి బాగా హైప్ వచ్చింది ఈ సీరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ కు 8.7  ఐమ్‌డీబీ రేటింగ్ ఉంది.

పర్మనెంట్ రూమ్మేట్స్ - ప్రైమ్ వీడియో

ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ లవర్స్ ఆలోచిస్తున్న తీరుపై తెరకెక్కిన సీరీస్ ఇది. మూడేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న జంట చివరికి పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్స్ లో ఉంటునే..వీళ్ల మధ్య ఉండే ప్రేమలు, వచ్చే తగాదాల చుట్టూ ఆసక్తికరంగా సాగే ఈ పర్మనెంట్ రూమ్మేట్స్  ప్రైమ్ వీడియోలో బెస్ట్ రేటింగ్స్,రివ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ కు 8.6 రేటింగ్ ఉంది.

సేక్రెడ్ గేమ్స్- నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సీరీస్ లో మంచి రివ్యూస్, రేటింగ్స్ సొంతం చేసుకున్నది ఈ సేక్రెడ్ గేమ్స్. ఈ వెబ్ సిరీస్ కు  8.5 రేటింగ్ ఉంది ఐమ్‌డీబీ.సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సీరీస్ లో నటించి మెప్పించారు.

ది రైల్వే మెన్ - నెట్‌ఫ్లిక్స్

మాధవన్‌ (Madhavan), దివ్యేందు, కేకే మీనన్‌, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్. 1984లో భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ (Bhopal Gas Leak) ప్రమాదం జరిగినప్పుడు..అక్కడ చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగుల జీవిత కథ ఆధారంగా ది రైల్వే మెన్‌ తెరకెక్కించినట్లు డైరెక్టర్ శివ్‌ రావలి (Shiv Rawail). ఆ సమయంలో భోపాల్ స్టేషన్ లో ఉన్న రైల్వే సిబ్బంది ఎంతో మంది నగర వాసుల ప్రాణాలను ఎలా కాపాడారో ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ సిరీస్ కు ఐమ్‌డీబీ 8.5 రేటింగ్ ఇచ్చింది. 

ఢిల్లీ క్రైమ్ - నెట్‌ఫ్లిక్స్

2012లో భారతదేశాన్ని కదిలించిన నిర్భయ రేప్ కేసు ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఉండగా..8.5 రేటింగ్ ఇచ్చింది ఢిల్లీ క్రైమ్.

జూబ్లీ - ప్రైమ్ వీడియో

జూబ్లీ వెబ్ సీరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఎదిగే క్రమంలో..అంటే, ఆ తొలినాళ్లలోని రాయ్ టాకీస్ స్టూడియో చుట్టూ తిరిగే కథ ఇది.అప్పటి సినిమా రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్.ఈ జూబ్లీ వెబ్ సిరీస్ కు ఐమ్‌డీబీ 8.3 రేటింగ్ ఇచ్చింది. 

  • Beta
Beta feature