KF బీర్లో చించేసిన కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న కస్టమర్.. సిద్దిపేట జిల్లాలోని వైన్స్లో ఘటన !

KF  బీర్లో చించేసిన కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న కస్టమర్.. సిద్దిపేట జిల్లాలోని వైన్స్లో ఘటన !

సిద్దిపేట: బీర్ కొనుక్కుని తాగుదామని వైన్స్‌కి వెళ్తే.. బీర్ సీసాలో చెత్తాచెదారం.. నిరోధ్ ప్యాకెట్ బయటపడింది. బీర్ సీసాను పరిశీలించి కంగుతిన్నారు మద్యం ప్రియులు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో వైన్స్ షాపు దగ్గర వినియోగదారులు ఆందోళనకు దిగారు. 

వైన్స్ నుంచి కొనుగోలు చేసిన బీర్ సీసాలో చించేసిన నిరోధ్ ప్యాకెట్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకుని వైన్స్‌కి వెళ్లి అడిగితే నిర్వాహకుల నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైన్స్ నిర్వాహకులు, వినియోగదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వినియోగదారులు మండిపడ్డారు. కల్తీ మద్యం వల్లే సీసాలో చెత్తాచెదారం వచ్చిందని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మద్యం దుకాణం యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వైన్స్‌పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు గొడవ జరగకుండా నచ్చ చెప్పి ఆందోళన విరమింప చేశారు.