అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నడోల బీభత్సం

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నడోల బీభత్సం
  • అమెరికాలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం

విన్ : అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన టోర్నడోల ధాటికి 26 మంది చనిపోయారు. ఇలినాయి, అర్కన్సా రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, నగరాల్లో భారీగా నష్టం జరిగింది. టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి ఇండ్లు ధ్వంసమయ్యాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి. ఎటుచూసినా ఇండ్ల శిథిలాలు చెత్తాచెదారం  కనిపించాయి. నాష్ విల్లే  స్టేట్ లోని టెన్నెస్సీ కౌంటీలో ఒకరు, అర్కన్సాలోని విన్  పట్టణంలో నలుగురు, ఇండియానా రాష్ట్రంలోని సల్లివాన్  సిటీలో ముగ్గురు, ఇలినాయి స్టేట్ లో ముగ్గురు చనిపోయారు.

అలాగే అలబామా, మిసిసిపీ రాష్ట్రాల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్కన్సా, అలబామా, మిసిసిపిలో 26 వేల బిల్డింగులను టోర్నడో చుట్టేసిందని అధికారులు తెలిపారు. విన్  టౌన్ లో ఒక స్కూల్  రూఫ్​ ఎగిరిపోయింది. ఎత్తైన చెట్లు కూలిపోయాయి. ఇండ్ల గోడలు దెబ్బతిన్నాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. పట్టణమంతా ఇండ్ల శిథిలాలే కనిపించాయి.