Massive Tornado: అమెరికాలో టోర్నడోల బీభత్సం..23 మంది మృతి

Massive Tornado: అమెరికాలో టోర్నడోల బీభత్సం..23 మంది మృతి

అమెరికాలో కనివినీ ఎరుగని విధంగా టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిపిలో శుక్రవారం (మార్చి 24న) అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో జనాలు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సుమారు 160 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపిందంటున్నారు. మరోవైపు టోర్నడాల కారణంగా పలు భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.

టోర్నడో విధ్వంసం అనంతరం రెస్క్యూ బృందాలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వెస్ట్రన్‌ మిస్సిస్పిప్పిలోని సిల్వర్‌సిటీలో దాదాపు 200 మంది నివసిస్తున్నారని, వారి ఆచూకి కోసం రెస్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని చెప్పారు. 

సుమారు 17 వందల మంది జనాభా ఉన్న రోలింగ్ ఫోర్క్‌ సైతం తుపాన్ దెబ్బకు తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ కూడా సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇలాంటి టోర్నడోలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు స్థానికులు. ఈ తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు.

https://twitter.com/TreasChest/status/1639513455333089280