
విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాఅవుకు జలాశయంలో పడవ బోల్తాపడి 12 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో రెండు మృతదేహాలు లభ్యమ్యాయి. మిగతావారి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పర్యాటకులుగా గుర్తించారు. మరో 9 మందిని రక్షించిన స్థానికులు రక్షించారు. అయితే ప్రమాద సమయంలో పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించలేదని అధికారులు గుర్తించారు. ఆదివారం ( మే 14) కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఇటువంటి దుర్ఘటనలు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల కిందటే అవుకు జలాశయంలో బోటు షికారు ప్రారంభించారు.