ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తా

ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తా

టూరిజం అంటే కొన్ని పట్టణాలకే పరిమితమైందని, కాలక్రమేణా చారిత్రాత్మక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి సీతక్క.  ములుగు జిల్లాను టూరిజం హబ్ గా మారుస్తామని మంత్రి సీతక్క అన్నారు. రామప్ప చెరువు మధ్య ద్వీపంలో శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. తొంభై కోట్ల ప్రతిపాదనలతో టూరిజం మంత్రికి నివేదిక ఇస్తాం... గుర్తింపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని, పల్లెలో ఉన్న ఆరోగ్యం, ఆనందం, పర్యాటకం ఎక్కడ ఉండదన్నారు మంత్రి సీతక్క. పల్లెలను అభివృద్ధి పథం లో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గోదావరి పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాలో కూడా ఉన్నాయి… ప్రకృతి సంపదను కాపాడుకుంటూ టూరిజాన్ని డెవెలప్ చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.. భవిష్యత్ తరాలకు కలలను,కళా కాండలను కాపడికోవాలని మంత్రి అన్నారు. .ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.