గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం: టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సస్పెన్షన్

గచ్చిబౌలి  బిల్డింగ్  ప్రమాదం: టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సస్పెన్షన్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో జరిగిన ఘోర భవన కూలి ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు తీసుకుంది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ శ్రీజన తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఏడు అంతస్తులు (గ్రౌండ్ + 6 అంతస్తులు, పెంట్‌హౌస్‌) నిర్మించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న మరో భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది.

శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వార్టర్స్ పరిధి దాటరాదని, కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వీడొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.