న్యూఢిల్లీ: కన్నడ రాక్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'టాక్సిక్'. 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్' అనేది ట్యాగ్ లైన్‌తో వస్తోంది. యశ్ బర్త్ డే (జనవరి 8) సందర్భంగా సినిమాలో అతడి క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. అయితే ఈ టీజర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీజర్లో శ్మశానం దగ్గర కారులో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
బోల్డ్ సీన్స్ శృతి మించడంతో పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్, కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లితో పాటు పలువురు టాక్సిక్ టీజర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఫిర్యాదు చేశారు.
ALSO READ : వాళ్లను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను.. తేల్చిచెప్పేసిన మీనాక్షి చౌదరి!
టీజర్‌లోని దృశ్యాలు శృతి మించాయని.. మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్లపై సెన్సార్ బోర్డు వర్గాలు స్పందించాయి. టాక్సిక్ మూవీ టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశారని.. యూట్యూ్బ్ తమ పరిధిలోకి రాదని సీబీఎఫ్సీ వర్గాలు స్పష్టం చేశాయి. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే ఆన్‌లైన్ ప్రమోషనల్ కంటెంట్ సీబీఎఫ్ పరిధిలోకి రాదని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ : మిక్స్‌డ్ టాక్‌తోనూ ప్రభాస్ రికార్డులు.. 4 రోజుల్లోనే 200 కోట్లు దాటేసిన రాజాసాబ్!
కేవలం థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు, ట్రైలర్‌లకు మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్ అవసరమని పేర్కొన్నాయి. టాక్సిక్ మూవీకి సంబంధించిన ఏ కంటెంట్‌కీ ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వలేదని, మూవీ యూనిట్ కూడా ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని సెన్సార్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్‌కు సీబీఎఫ్ సీ సర్టిఫికేట్ అవసరం లేదని వివరణ ఇచ్చాయిసీబీఎఫ్ సీ వర్గాలు.
ఇక 'టాక్సిక్' విషయానికొస్తే.. ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్ తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. భారీ అంచనాలతో ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
