The RajaSaab Box Office Day4 : మిక్స్‌డ్ టాక్‌తోనూ ప్రభాస్ రికార్డులు.. 4 రోజుల్లోనే 200 కోట్లు దాటేసిన రాజాసాబ్!

The RajaSaab Box Office Day4 : మిక్స్‌డ్ టాక్‌తోనూ ప్రభాస్ రికార్డులు.. 4 రోజుల్లోనే 200 కోట్లు దాటేసిన రాజాసాబ్!

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఆ లెక్కలే వేరే. థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే.  మారుతి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  'రాజాసాబ్'  జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే  భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను అందుకుంది. అయినా ఈ హారర్ కామెడీ చిత్రం ఓపెనింగ్స్ అదిరిపోయాయి. 

నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

తోలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 112 కోట్ల రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగు రోజులు ముగిసేసరికి రూ. 201 కోట్ల మార్కును దాటేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే.. సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ లెక్కల ప్రకారం.. ఈ నాలుగు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 114.6 కోట్లుగా ఉన్నాయి. ఆదివారం రూ. 19.1 కోట్లు సాధించిన ఈ చిత్రం, సోమవారం వచ్చేసరికి కొంత డ్రాప్ కనిపిస్తూ రూ. 6.6 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో వేగం అందుకోలేపోయింది.

ALSO READ : మిస్టర్ మోడీ.. మీరెప్పటికీ విజయం సాధించలేరు

గట్టి పోటీలోనూ డార్లింగ్ జోరు..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సోమవారం జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ విడుదలైంది.  బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి పెద్ద సినిమా పోటీలో ఉన్నప్పటికీ, ప్రభాస్ క్రేజ్ వల్ల 'రాజాసాబ్' తన ఉనికిని చాటుకుంటోంది. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కావాలంటే లాంగ్ రన్ అవసరమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు భామలు ప్రభాస్‌కు జోడీగా నటించారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.  మారుతి తనదైన శైలిలో హారర్‌కు కామెడీని జోడించి ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూపించారు.

ALSO READ : వాళ్లను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను.. తేల్చిచెప్పేసిన మీనాక్షి చౌదరి!

సంక్రాంతి సెలవులు కలిసొస్తాయా?

నిజానికి సినిమాకు వచ్చిన రివ్యూలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ , ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి సెలవుల సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఖరీదైన హారర్ కామెడీగా పేరుగాంచిన 'రాజాసాబ్', ఫైనల్ రన్‌లో ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ సినిమాల జోరు, మరోవైపు డార్లింగ్ మ్యానరిజమ్స్.. మొత్తానికి ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధాన్ని తలపిస్తోంది.. మరి కొన్ని రోజుల్లో అసలు సంక్రాంతి విన్నర్ ఎవరో తేలనుంది.

ALSO READ : ప్రశ్నించడానికి భయమెందుకు? ట్రోలింగ్‌పై సమంత స్ట్రాంగ్ రిప్లై!