న్యూఢిల్లీ: స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ జన నాయగన్ మూవీ సెన్సార్ బ్లాక్ ఇష్యూపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే జన నాయగన్ సినిమా విడుదలను అడ్డుకుంటుందని ఆరోపించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి చేస్తోందని.. తమిళ ప్రజల గొంతును అణచివేయాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘‘జన నాయగన్ మూవీని అడ్డుకోవడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి. మిస్టర్ మోడీ తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ALSO READ : దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
వివాదం ఏంటంటే..?
దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు.
ALSO READ : చైనా మాంజాపై సీపీ సజ్జనార్‌కు HRCనోటీసులు
దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCను ఆదేశించింది.
అయితే.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌లో ఛాలెంజ్ చేసింది. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ నిర్ణయంతో విజయ్ జన నాయగన్ మూవీ పొంగల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్లైంది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ALSO READ : ప్రజల ప్రాణాలే ముఖ్యం: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
జన నాయగన్ మూవీ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. సెన్సార్ బోర్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఈ సినిమా విడుదలను అడ్డుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కూడా ఈ ఇష్యూలో విజయ్‌కు నిలబడింది. ఈడీ, సీబీఐ మాదిరిగా సెన్సార్ బోర్డు కూడా కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
