మూసీ బ్రిడ్జిపైనే చర్చిద్దాం రా : కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేష్ సవాల్

మూసీ బ్రిడ్జిపైనే చర్చిద్దాం రా : కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేష్ సవాల్

మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై.. డీపీఆర్ ఇంకా రెడీ కాకుండా అవినీతి అంటూ కేటీఆర్ చేస్తున్న కామెంట్లపై విరుచుకుపడ్డారు టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా.. నేను నా మంత్రులతో వస్తా.. నువ్వు మీ పార్టీ వాళ్లతో వస్తావా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు పీసీసీ చీఫ్.

హైడ్రా, మూసీ.. రాహుల్ గాంధీకి లింక్ ఏంటని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. చెరువులను కుంటలను ప్రొటెక్ట్ చేయడమే హైడ్రా ముఖ్య టాస్క్ అని అన్నారు.  16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు.  బీఆర్ఎస్ హయాంలోనే  ఆక్రమణలకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఆరు నెలలుగా మీ నాయనా ఎక్కడ దాక్కున్నాడో తమకు  అనుమానాలున్నాయన్నారు.

 మూసి ప్రక్షాళనలో ఒక్క రూపాయి తాము తిన్నట్టైతే .. పురాణపుల్ బ్రిడ్జి మీద మా మంత్రులతో వస్తాం.  కేటీఆర్ నువ్ రా.. తిన్నది నిజమైతే  మూసిలో నేను దూకుతా లేదంటే నువ్వు దూకు. డీపీఆర్ కాక ముందే  లక్ష కోట్లు అంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. మూసి ప్రక్షాళన తెరమీదకు తెచ్చింది 2016లో నగరాన్ని  అదుకుంటా అన్నోడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 

ALSO READ | మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ లీడర్లు రెచ్చగొడ్తున్నరు : విప్ అడ్లూరి

మూసి బాధితులందరిని గుర్తించి పునరావాసం కల్పిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు మూసి నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.   కేటీఆర్ తో   పోల్చితే  హరీష్ రావుకు మానవత్వం ఉందన్నారు. కొండా సురేఖ సోషల్ మీడియా పోస్ట్ పై కనీసం కేటీఆర్ స్పదించలేదన్నారు.  హరీష్ రావు కొండా సురేఖకు మద్దతుగా ట్వీట్ చేశారని తెలిపారు.