దేశంలోనే తెలంగాణ కేబినెట్ బెస్ట్ అని అన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ హయాం సువర్ణమయమని అన్నారు. కేసీఆర్ తెలంగాణను బ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల్లో నెట్టారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కుతారా అని ప్రశ్నించారు. గ్రూప్- 1 పై ఉన్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేసుకున్నామని చెప్పారు. నిరుద్యోగులు బీజేపీ బీఆర్ ఎస్ మాయలో పడొద్దని సూచించారు. మెరిట్ స్టూడెంట్స్ కు ఎలాంటి అన్యాయం జరుగదని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. అన్నివర్గాల కృషితోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తల పార్టీ కాంగ్రెస్.. కష్టపడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ మారి వచ్చిన వారికి పదవుల్లో రెండో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు మహేశ్ కుమార్.