
వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ లొల్లి అంతా ఉట్టి డ్రామా అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా ఉండి ధాన్యం కొనకపోతే పదవుల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ప్రతి గింజ కొంటానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు రేవంత్. వడ్లు ఎందుకు కొనరో చూస్తామన్నారు. కేంద్రంపై పోరాడేది ఉంటే కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేయాలన్నారు రేవంత్. గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ధర్నాకు ఎందుకు బయటకు రాలేదన్నారు.
ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదన్నారు. కేవలం వాయిదా మాత్రమే వేశామన్నారు. కలెక్టర్‌లు రాజకీయ అవతారం ఎత్తారన్నారు. టిఆర్ఎస్ ధర్నాలకు అనుమతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మా పార్టీ కి ఎంధుకు ఇవ్వరుని ప్రశ్నించారు. నిబంధనలు మాకు మాత్రమేనా? టిఆర్ఎస్ ,బీజేపీలకు ఉండవా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన తెలుపుతామన్నారు. బీజేపీ ,టిఆర్ఎస్ లు తోడుదొంగలు అన్నారు. వడ్ల కొనుగోలు విషయం లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఒక పది వేల కోట్లు వడ్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా అన్నారు రేవంత్. ఇంత ధనిక రాష్ట్రంలో రైతుల కోసం ఆ మాత్రం వ్యయం చేయలేరా? ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతీ ధాన్యం గింజ కొనాల్సిందేనని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
బాలల దినోత్సవం సందర్భంగా .. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు పీసీసీ చీఫ్. దేశ స్వాత్రత్యం కోసం పది సంవత్సరాలు జైలు లో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఒక పండుగ అన్నారు. దేశ స్వాతత్ర్యంలో ఎలాంటి పాత్ర లేని వారు...బ్రిటిష్ వారితో కాదు ,అంతర్గతంగా మతలాతో కోట్లాడాలని అన్నవారిని ఈరోజు దేశ భక్తులుగా చూపిస్తున్నారన్నారు. నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని పేర్కొన్నారు రేవంత్. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తూ కొత్త దేశభక్తుల అవతరమెత్తారని విమర్శించారు. దేశం కోసం త్యాగం చేసిన మహా నేతలను అవమాన పరిచే విధంగా ప్రవరిస్తున్నారు ఆరోపించారు.