జీతాల పెంపు పై కేసీఆర్ కు రేవంత్ ఓపెన్ లెటర్

జీతాల పెంపు పై కేసీఆర్ కు  రేవంత్ ఓపెన్ లెటర్

రాష్ట్రంలో హోమ్ గార్డ్స్, మోడల్ స్కూల్  సిబ్బంది జీతాల పెంపుపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు . సిబ్బందికి వెంటనే జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విందులు, విలాసాలు, విదేశీ యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పూట గడవని హోం గార్డుల పరిస్థితి గురించి మాత్రం ఆలోచించడంలేదని లేఖలో తెలిపారు. 

తొలకరి మొదలై.. వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకూ రైతు బంధు నిధులు విడుదల చేయలేదని.. అసలు ఈ సారి రైతుబంధు ఉంటుందా.. ఉంటే ఎప్పుడిస్తారు.. అసలు ఇస్తారా లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ దుష్ట పాలనలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని, అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు.