పడేండ్ల అరాచకాలు ప్రజలు మర్చిపోలే : పెండెం రామానంద్

పడేండ్ల అరాచకాలు ప్రజలు మర్చిపోలే : పెండెం రామానంద్

నర్సంపేట, వెలుగు: నర్సంపేటలో పదేండ్లలో బీఆర్​ఎస్​నాయకులు చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ మెంబర్​ పెండెం రామానంద్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి తన చుట్టు పక్కల ఉన్న నాయకులు చేసిన మట్టి దందాలు, భూ కబ్జాలు, గ్రీన్​ ల్యాండ్ ఆక్రమణలు ప్రజలు ఇంకా మర్చిపోలదుని, ఇప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మాధవరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు.

కార్యక్రమంలో నర్సంపేట పట్టణాధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.