నవంబర్ 06న కొడంగల్‌లో, 10న కామారెడ్డిలో .. నామినేషన్‌ దాఖలు చేయనున్న రేవంత్‌

నవంబర్ 06న  కొడంగల్‌లో, 10న కామారెడ్డిలో .. నామినేషన్‌ దాఖలు చేయనున్న రేవంత్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి రెండు చోట్లల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ తో పాటుగా సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో  కూడా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో  2023 నవంబర్ 06న కొడంగల్‌లో,  నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు రేవంత్.   గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటెల, కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ చేస్తు్ండటంతో   ఈ సారి ఎన్నికలు మరింత అసక్తిగా మారాయి.  ఇక, రేవంత్​ కామారెడ్డి బరిలో ఉంటుండటంతో షబ్బీర్​అలీ నిజామాబాద్​ అర్బన్​ నుంచి బరిలోకి దిగనున్నారు.  కాగా సీఎం  కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  

నేడు థర్డ్​లిస్ట్​?

కాంగ్రెస్​పార్టీ మూడో లిస్ట్​ ఆదివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. అన్ని స్థానాలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి అందజేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర నేతలతో ఒకసారి జూమ్​లో సమావేశమై చర్చించాక ఆదివారం మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్​ ఉన్నది.  కామారెడ్డి, నిజామాబాద్​ అర్బన్​ స్థానాలు దాదాపు ఖరారైపోయిన నేపథ్యంలో.. మిగతా17 స్థానాలపైనే కాంగ్రెస్​ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. సీపీఎం, సీపీఐ పొత్తులు ఎటూ తేలకపోవడం, సీపీఎం తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించడంతో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థుల పేర్లే ప్రకటించే అవకాశం ఉంది.