హైదరాబాద్లో టీపీఎల్‌‌–8.. 25 పాయింట్ల ఫార్మాట్లో మ్యాచ్

హైదరాబాద్లో టీపీఎల్‌‌–8.. 25 పాయింట్ల ఫార్మాట్లో మ్యాచ్

హైదరాబాద్‌‌: టెన్నిస్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (టీపీఎల్‌‌) ఎనిమిదో సీజన్‌‌ పోటీలకు హైదరాబాద్‌‌ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో డిసెంబర్‌‌ 8 నుంచి 13 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 

25 పాయింట్ల ప్రత్యేకమైన ఫార్మాట్‌‌లో మ్యాచ్‌‌లు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో  పోటీపడనున్నాయి. జీఎస్‌‌ ఢిల్లీ ఏసెస్‌‌, హైదరాబాద్‌‌ స్ట్రైకర్స్‌‌, లక్నో బ్లేజర్స్‌‌, గుర్గావ్‌‌ గ్రాండ్‌‌స్లామర్స్‌‌, గుజరాత్‌‌ పాంథర్స్‌‌, రాజస్తాన్‌‌ రేంజర్స్‌‌, కోల్‌‌కతా థండర్‌‌ బ్లేడ్స్‌‌, ముంబై రాయల్స్‌‌ టైటిల్‌‌ కోసం పోటీపడనున్నాయి.

ప్రతి పాయింట్‌‌ అత్యంత కీలకమయ్యే ఈ టోర్నీలో ఇంటర్నేషనల్‌‌ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. టెన్నిస్‌‌ లెజెండ్స్‌‌ లియాండర్‌‌ పేస్‌‌, సానియా మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.